టాలీవుడ్ లో 'రివ్యూ'ల రగడ... సమీక్షకులు అసలు సినిమా ఎక్కడ చూస్తున్నారన్న మంచు విష్ణు!

  • సరైన సమీక్షలు రావడం లేదు
  • సినిమా చూస్తూ అప్ డేట్స్ ఏంటి?
  • శ్రద్ధగా చూస్తే అభిప్రాయం మారుతుంది
  • రివ్యూలపై స్పందించిన మంచు విష్ణు
విడుదలయ్యే తెలుగు సినిమాలపై విశ్లేషకులు రివ్యూలను సరిగ్గా ఇవ్వడం లేదని ఎన్టీఆర్, బాగుంటే బాగున్నాయని, లేదంటే బాగలేదని మాత్రమే రాస్తున్నారని మహేష్ బాబు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై మరో హీరో మంచు విష్ణు కూడా స్పందించాడు. అసలు సినిమాను చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని అన్నాడు.

సినిమాను మనసు పెట్టి చూడకుండా అప్ డేట్స్ ఇస్తున్నారని, శ్రద్ధగా, ఏకాగ్రతతో చూస్తే సినిమాపై మరింత స్పష్టమైన అభిప్రాయం వస్తుందని అన్నాడు. సినిమా చూస్తూ ఎటువంటి అప్ డేట్స్ నూ ఇవ్వరాదని సూచించాడు. బాధ్యత ఉన్న వారెవరూ ఆ పని చేయరని అన్నాడు. తాము ఎంతో కష్టపడి సినిమాను తీస్తుంటే, సరైన సమీక్షలు రావడం లేదని ఆక్షేపించాడు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేశాడు.

కాగా, ఎన్టీఆర్ 'జై లవకుశ' గత వారంలో విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకెళుతుండగా, కొందరు సినీ విశ్లేషకులు యావరేజ్, బిలో యావరేజ్ రేటింగ్ ఇవ్వడంపై ఎన్టీఆర్ మండిపడిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులే సినిమా బతికిందో, చనిపోయిందో చెప్పే వైద్యులని, మధ్యలో దారినపోయే దానయ్యలు (సమీక్షకులు) సినిమా పోయిందని మాటలు చెప్పడమేంటని విరుచుకుపడ్డాడు.
Go Back to Shorts
tollywood
reviews
ntr
mahesh babu
manchu vishnu

More Telugu News