మరో రాజేష్... పెళ్లి చేసుకుని భార్యను చిత్రహింసలు పెడుతున్న 'గే'!

  • పోలీసుల ముందుకొచ్చిన కేసు
  • విషయం దాచి తన జీవితం నాశనం చేశారన్న యువతి
  • విచారణ జరుపుతున్న హైదరాబాద్ పోలీసులు
చిత్తూరు జిల్లాలో సంసారానికి పనికిరాని రాజేష్, తొలిరాత్రే తన భార్యను తీవ్రంగా హింసించిన ఉదంతం మరువక ముందే అటువంటి మరో కేసు తెరపైకి వచ్చింది. జహీరాబాద్ కు చెందిన స్వలింగ సంపర్కుడు అంకుష్, విషయాన్ని బయటపెట్టకుండా వివాహం చేసుకుని, తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను 'గే' అన్న విషయాన్ని దాచిపెట్టి, పెళ్లి చేసుకున్నాడని, తల్లిదండ్రులతో కలసి తనను హింసిస్తున్నాడని, అదనపు కట్నం కోసం కూడా వేధిస్తున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. తన జీవితాన్ని నాశనం చేశారని, న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్ పోలీసులను యువతి ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Saidabad
Police
Gay
Marriage

More Telugu News