తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ కు అవమానం: రావుల

  • ఎన్టీఆర్ పేరును విస్మరించారు
  • సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది
  • పోస్టర్లలో ఆంగ్ల భాషను వాడారు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తీరుపై టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిష్టాత్మకమైన ఈ సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. అందరినీ కలుపుకుని ఈ వేడుకలు జరిపితే బాగుండేదని అన్నారు.

మహా సభల సందర్భంగా కొందరు మహనీయులను విస్మరిస్తున్నారని... ఎన్టీఆర్ పేరును కూడా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎన్టీఆర్ ను అవమానించడమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో ఇంగ్లీష్ భాషను వాడారంటూ మండిపడ్డారు. ఖాళీగా ఉన్న తెలుగు భాషా పండితుల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
prapancha telugu maha sabhalu
ravula chandra sekhar reddy
tTelugudesam

More Telugu News