షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కొట్టిన పోలీస్ అధికారిపై వేటు!

  • యోగిని గంగిరెడ్డి కొట్టిన ఘటనపై విచారణ
  • వీఆర్ కు తరలింపు
  • సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలు
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కొట్టిన డీసీపీ గంగిరెడ్డిపై వేటు పడింది. వీఆర్ కు పంపిస్తూ సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలు జారీ చేశారు. గంగిరెడ్డిపై హారిక అనే యువతి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆయన్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లిన సమయంలో ఆయనను అడిషినల్ డీసీపీ గంగిరెడ్డి కాలితో తన్నుతూ, లెంపలు వాయించిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటన నేపథ్యంలో గంగిరెడ్డిపై ఉన్నతాధికారులు మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశించారు. విచారణ అనంతరం డీసీపీ గంగిరెడ్డిని వీఆర్ కు పంపాలని శాండిల్య ఆదేశించారు. 
Go Back to Shorts
madapur
cyberabad

More Telugu News