హీరోయిన్ అదితికి మరువలేని కానుకను ఇచ్చిన రజనీకాంత్!

  • తమిళనాట సూపర్ హిట్ అయిన 'అరువి'
  • చూసి అచ్చెరువొందిన సూపర్ స్టార్
  • హీరోయిన్ ను, దర్శకుడిని ఇంటికి ఆహ్వానించి గౌరవించిన రజనీ
  • బంగారు గొలుసుల బహూకరణ
తమిళనాట విమర్శలతో పాటు, విజయాన్నీ అందుకున్న 'అరువి' హీరోయిన్ అదితి బాలన్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ మరువలేని కానుకను ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న 'అరువి', ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను చూసిన రజనీ కాంత్ ఫిదా అయిపోయారట.

తనను ఎంతో నవ్విస్తూనే, ఏడిపించిందని, జీవితంలోని ఎన్నో అంశాలను గురించి ఆలోచించేలా చేసిందని, కొన్ని సంవత్సరాల పాటు ఈ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారని అభిప్రాయపడ్డ రజనీ, అదితిని, సినిమా దర్శకుడు అరుణ్ ప్రభును తన ఇంటికి ఆహ్వానించి గౌరవించారు. వారికి బంగారు గొలుసులను బహూకరించారు. కాగా, తనకు నచ్చినట్టు ఉండాలని భావించే యువతి చేస్తున్న పనులను సమాజం హర్షించని వేళ, ఆమె ఏం చేసిందన్న కథాంశంతో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తమిళనాట ఓ సెన్సేషన్.
Go Back to Shorts
Rajanikant
Aruvi
Aditi Balan

More Telugu News