జ్యోతిష్యుడి బుట్టలో మంత్రి అచ్చెన్న.. పూజల కోసం రూ.80 లక్షల సమర్పణ?

  • గ్రహస్థితులు అనుకూలంగా లేవన్న జ్యోతిష్యుడు శర్మ
  • పూజలు చేయించుకున్న మంత్రి
  • సిక్కోలులో చక్కర్లు కొడుతున్న వార్తలు
నక్సలైట్లమని బెదిరించి మంత్రి అచ్చెన్నాయుడి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాలని ప్లాన్ వేసిన జ్యోతిష్యుడికి మంత్రి గతంలో రూ.80 లక్షలు సమర్పించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది నవంబరులో పార్వతీపురంలో జ్యోతిష్యుడు కాళిదాసు శర్మ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగం నిర్వహించారు.

అచ్చెన్నాయుడు సతీసమేతంగా ఈ యాగంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన గ్రహస్థితులు బాగాలేవని తెలుసుకున్న మంత్రి.. కాళిదాసు శర్మతో పూజలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం జ్యోతిష్యుడికి ఏకంగా రూ.80 లక్షలకు పైనే ముట్టజెప్పారన్న ప్రచారం జరుగుతోంది.

ఈసారి మరింత పెద్ద మొత్తంలో మంత్రి నుంచి డబ్బులు గుంజాలని పథక రచన చేసిన శర్మ నక్సలైట్ల పేరుతో బెదిరించి, అడ్డంగా బుక్కయ్యాడు. అనుచరుడితో కలిసి మంత్రి ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం శర్మతోపాటు అతడి అనుచరుడు కూడా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు.
Go Back to Shorts
Minister
Atchannaidu
Kalidasu Sharma
Naxal

More Telugu News