‘మక్కళ్‌ నీది మయ్యమ్‌'... ఇది కమల్ కొత్త పార్టీ పేరు!

  • నా పార్టీ పేరు ‘మక్కళ్‌ నీది మయ్యమ్‌’ (జస్టిస్‌ ఫర్‌ పీపుల్‌)'- కమల్‌ 
  • పార్టీ జెండా కూడా ఆవిష్కరణ 
  • వేదికపై కేజ్రీవాల్‌ కూడా
తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. సినీనటుడు కమల హాసన్ ఈ రోజు మధురై ఒత్తకడై మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో తన పార్టీ పేరు ప్రకటించారు. మొదట పార్టీ జెండాను ఆవిష్కరించిన కమల హాసన్.. అనంతరం తన పార్టీ పేరు ‘మక్కళ్‌ నీది మయ్యమ్‌’ (జస్టిస్‌ ఫర్‌ పీపుల్‌) అని ప్రకటించారు. కమల హాసన్ తో పాటు వేదికపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు నేతలు ఉన్నారు. కాసేపట్లో కమలహాసన్ పార్టీ విధానాలు, తన రాష్ట్ర పర్యటన గురించి తెలపనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు.  
Go Back to Shorts
Kamal Haasan

More Telugu News