చాలా కాలం తరువాత గొప్ప సినిమా చూశానన్న ఆమీర్ ఖాన్

  • గొప్ప కథ, అద్భుత నటన
  • 'హిచ్ కి'ని మిస్ కాకండి
  • చిత్ర బృందానికి ధన్యవాదాలు
చాలా కాలం తరువాత ఒక మంచి సినిమా చూశానని బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ తెలిపాడు. రాణిముఖర్జీ ప్రధాన పాత్రలో రూపొందిన ‘హిచ్‌ కి’ సినిమాపై ఆమిర్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించాడు. దీనిపై ట్వీట్ చేస్తూ, ‘చాలా కాలం తరువాత ఒక మంచి సినిమా చూశాను. గొప్ప కథ, అద్భుత నటన, సూపర్‌ సినిమా, ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఉంది. ఆ సినిమాయే 'హిచ్‌ కి'. దయచేసి ఈ సినిమాను మిస్‌ కాకండి. రాణీముఖర్జీ, సిద్ధార్థ్‌, నీరజ్‌ కబి, యువ చిత్ర బృందానికి ధన్యవాదాలు..చాలా బాగుంది’ అన్నాడు. 
Go Back to Shorts
hichki
movie
rani mukharkee
Aamir Khan

More Telugu News