తహసీల్దార్‌ ఉద్యోగాల కోసం.. గాడిదకు హాల్‌ టిక్కెట్‌ జారీ చేసిన అధికారులు!

  • జమ్ముకశ్మీర్‌లో అధికారుల నిర్వాకం
  • పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
  • తాజాగా హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌
తహసీల్దార్‌ ఉద్యోగాల కోసం పరీక్ష రాయడానికి ఓ గాడిదకు హాల్‌ టికెట్‌ జారీ చేసిన వింత సంఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాజాగా హాల్‌ టిక్కెట్లు పొందగా అందులో ఒకటి గాడిద పేరు, ఫొటోతో ఉంది. ఆ హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకంతో పాటు జమ్ముకశ్మీర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు సెక్రటరీ సంతకం సైతం ఉండడం గమనార్హం.

అభ్యర్థి పేరు ఉండే చోట గోధుమ వర్ణపు గాడిద అని ఉంది. ఈ హాల్‌టికెట్‌ ఎలా బయటకు వచ్చిందో కానీ, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. హాల్‌ టిక్కెట్లు జారీ చేసిన అధికారులపై విమర్శల జల్లు కురుస్తోంది.
Go Back to Shorts
donkey
hall ticket
Jammu And Kashmir

More Telugu News