చెన్నై చేరుకున్న ర‌జ‌నీకాంత్‌

  • ఇటీవల అమెరికాకు రజనీ
  • హెల్‌ చెకప్‌ చేయించుకున్న తలైవా
  • చెన్నై ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
సౌతిండియా సూపర్‌ స్టార్‌ ర‌జ‌నీకాంత్ అమెరికా నుంచి తిరిగి చెన్నై చేరుకున్నారు. ఆయన ఇటీవల హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం అమెరికాకు వెళ్లి రెగ్యుల‌ర్ మెడిక‌ల్ చెక‌ప్ చేయించుకున్నారు. చాలా రోజుల తరువాత చెన్నైకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటికి వెళ్లిన ర‌జ‌నీకి ఆయన స‌తీమ‌ణి హార‌తి ఇచ్చి బొట్టు పెట్టారు. రజనీకాంత్ ఇటీవలే కాలా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఈ నెల 9న ఆ సినిమా ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. కాగా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్‌ ఆ పనుల్లోనూ పాల్గొననున్నారు.    
Go Back to Shorts
Rajinikanth
chennai
america

More Telugu News