నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు!: యడ్యూరప్ప

  • బీజేపీకి ఓటు వేయని వాళ్ల కాళ్లూచేతులూ కట్టేయమని నేనలేదు
  • కాళ్లూచేతులూ పట్టుకుని ఓటేయించమన్నా
  • నేను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని
వచ్చే ఎన్నికల్లో ఎవరైతే బీజేపీకి ఓటు వేయరని తెలుస్తుందో వారి కాళ్లూ చేతులూ కట్టేసి తీసుకొచ్చి మరీ, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయించాలని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ఓటు వేయని వారి కాళ్లూచేతులూ పట్టుకుని వారి చేత ఓటు వేయించాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు. తాను ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తినని, గ్రామాల్లో ఇదేవిధంగా మాట్లాడుకుంటారని అన్నారు. కాగా, కిత్తూరు సమీపంలోని ఎంకె హుబ్బళ్లిలో నిన్న ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలోనే యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సభలో కలకలం రేగింది. యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా ఉన్నాయని మండిపడ్డారు.
Go Back to Shorts
Karnataka
yedurappa

More Telugu News