తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి మృతదేహం!

  • రెండో కనుమ దారిలో ఘటన
  • గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మరణించింది. రహదారిలో విఘ్నేశ్వరుని ఆలయానికి పై భాగంలో రోడ్డుపై పడివున్న చిరుతపులి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అడవి నుంచి రోడ్డుపైకి వచ్చిన చిరుతను వాహనం ఢీకొనగా, ముఖానికి తీవ్ర గాయాలై మరణించిందని తెలిపారు. ఈ చిరుతకు మూడు సంవత్సరాల వయసు ఉంటుందని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో తిరుమల గిరుల పరిధిలో చిరుతపులుల సంచారం కాస్తంత తగ్గిందని భావిస్తుండగా, తాజా ఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
Cheeta
Leopard

More Telugu News