యడ్యూరప్ప అనే నేను..17న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా!: బీజేపీ నేత ధీమా

  • కాబోయే ముఖ్యమంత్రిని నేనే
  • ప్రమాణస్వీికారానికి ముఖ్యఅతిథిగా మోదీ హాజరవుతారు
  • సిద్ధరామయ్యకు ఓటమి తప్పదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటున్న నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రిని తానేనని, ఈ నెల 17న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని, తాను అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పడం గమనార్హం.

విజయపుర స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించనున్న బసవరాజపాటిల్ యత్నాళ్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తానని చెప్పిన యడ్యూరప్ప, సిద్ధరామయ్య పోటీ చేసే రెండు స్థానాల్లో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కాగా, బెంగళూరులోని ప్రముఖ సుందరేశ్వర ఆలయాన్ని నిన్న యడ్యూరప్ప సందర్శించారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్లు ఆయన చుట్టూ చేరడంతో వారికి వంద రూపాయలు ఇచ్చి అందరినీ పంచుకోమని చెప్పారు. 
Go Back to Shorts
Karnataka
yedurappa

More Telugu News