రూ. 205 కోట్లు దాటిన 'భరత్ అనే నేను': డీవీవీ దానయ్య

  • ట్విట్టర్ లో వెల్లడించిన దానయ్య
  • మూడు వారాల్లో రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు
  • ప్రస్తుతం విదేశాల్లో మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా నిర్మితమై సూపర్ హిట్ అయిన 'భరత్ అనే నేను' కలెక్షన్లు రూ. 205 కోట్లు దాటాయి. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తొలి రోజు నుంచే రికార్డుల వేటను కొనసాగిస్తున్న ఈ చిత్రం మూడు వారాల్లోనే రూ. 205 కోట్లను తాకడం గమనార్హం.

తొలి రోజున రూ. 40 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలివారంలో రూ. 161 కోట్లను, ఆపై రెండో వారంలో రూ. 190 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం తన కుటుంబంతో సినిమా సక్సెస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Bharath Ane Nenu
Mahesh Babu
DVV Danaiah

More Telugu News