ఏడేళ్ల కుమారుడితో కలిసి 25వ అంతస్తు నుంచి దూకి, ఆత్మహత్య చేసుకున్న ప్లేబోయ్ మాజీ మోడల్!

  • కుమారుడి విషయంలో మాజీ భర్తతో విభేదాలు
  • ఆత్మహత్యకు అదే కారణమంటున్న స్నేహితులు
  • దర్యాప్తు ప్రారంభించిన న్యూయార్క్ పోలీసులు
అమెరికాకు చెందిన ప్లేబోయ్ మాజీ మోడల్ స్టెఫానీ ఆడమ్స్(45) తన ఏడేళ్ల కుమారుడు విన్సెంట్‌తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. న్యూయార్క్‌లోని ఓ హోటల్ 25వ అంతస్తు నుంచి కుమారుడితో కలిసి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కుమారుడి విషయంలో విడిపోయిన భర్త చార్లెస్ నికోలయ్‌తో స్టెఫానీకి విభేదాలున్నాయి.

గోథమ్ హోటల్ 25వ అంతస్తు పెంట్‌హౌస్‌లోని కిటికీ నుంచి ఆమె దూకినట్టు హోటల్ సిబ్బంది ఒకరు చెప్పారు. రెండో అంతస్తు బాల్కనీలో పడిన తల్లీ కుమారుడు దుర్మరణం పాలయ్యారని ఆయన వివరించారు. తన బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్న యూరప్‌కు తన కుమారుడిని తీసుకెళ్తానని మాజీ భర్త చెప్పడంతో స్టెఫానీ తీవ్ర ఆవేదనలో మునిగిపోయిందని ఆమె స్నేహితులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు అదే కారణం అయి ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
playboy
America
Suicide
Model

More Telugu News