సచిన్‌ ట్వీట్‌పై ఎలా స్పందించాలో అర్థం కాలేదు: సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్

  • ఇటీవల ముగిసిన ఐపీఎల్‌
  • రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన
  • ప్రశంసిస్తూ సచిన్‌ ట్వీట్‌
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ పై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రషీద్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో ఎంతో గొప్ప ఆటగాడని, ఆయన తనను పొగుడుతూ ట్వీట్ చేయడంతో మొదట తాను ఆశ్చర్యపోయానని అన్నాడు.

తాను బస్సులో వెళుతుండగా తన స్నేహితుడి నుంచి వచ్చిన ఒక మెసేజ్ చూసుకున్నానని, సచిన్ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి పంపించాడని అన్నాడు. తన గురించి సచిన్ ట్వీట్ చేయడంతో ఎలా స్పందించాలో తెలియక రెండు మూడు గంటల పాటు ఏ రిప్లై ఇవ్వలేదని పేర్కొన్నాడు. చివరకు తాను రిప్లై ఇచ్చానని తెలిపాడు.
Go Back to Shorts
ipl
Sachin Tendulkar
rashid

More Telugu News