అంచనాలు పెంచేస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు'

  • 'శైలజా రెడ్డి అల్లుడు'గా చైతూ 
  • ఆయన సరసన అనూ ఇమ్మాన్యుయేల్ 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
నాగచైతన్య ఒక వైపున 'సవ్యసాచి' సినిమాను పూర్తి చేస్తూనే .. మరో వైపున మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను .. రెండు పాటలను చిత్రీకరించారు. ఈ రెండు పాటలకి కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. తెలుగు రాష్ట్రాలు కాకుండా .. రెస్ట్ ఆఫ్ ఇండియా .. శాటిలైట్ .. డిజిటల్ హక్కులు కలుపుకుని నిర్మాతకి 14 కోట్ల వరకూ ముట్టినట్టుగా సమాచారం.తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే మొత్తాన్ని కలుపుకుంటే విడుదలకి ముందే పెట్టుబడితో పాటు లాభాలు కూడా రావడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమాకి ముందు మారుతి తెరకెక్కించిన 'మహానుభావుడు' భారీ విజయాన్ని సాధించడం .. 'శైలజా రెడ్డి అల్లుడు' అత్తా అల్లుళ్లకి సంబంధించిన సక్సెస్ ఫార్ములా కావడం వలన ఈ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. కీలకమైన పాత్రను రమ్యకృష్ణ పోషిస్తుండగా, చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
nagachaitanya
anu emmanuel

More Telugu News