నిర్మాత తనయుడిని హీరోగా పరిచయం చేసే పనుల్లో తేజ

  • ప్రేమకథలపై పట్టు వున్న తేజ
  • మరో ప్రేమకథకు శ్రీకారం 
  • నిర్మాత తనయుడే హీరో  
తెలుగు తెరపై ప్రేమకథలను పరుగులు తీయించిన దర్శకులలో తేజ స్థానం ప్రత్యేకం. ప్రేక్షకులకు కొత్త ప్రేమకథలతో పాటు కొత్త హీరోలను కూడా ఆయన పరిచయం చేశారు. అలా ఆయన ఉదయ్ కిరణ్ .. నితిన్ .. నవదీప్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ముగ్గురూ కూడా యూత్ లో క్రేజ్ ను .. మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

అందువలన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా తన తనయుడిని తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే తేజ వున్నాడని అంటున్నారు. 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రాజెక్టు నుంచి  .. వెంకటేశ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తేజ, రానాతోనే మరో సినిమా చేయాలనుకున్నాడు. కంటికి సంబంధించిన సమస్యతో రానా ఇబ్బంది పడుతోన్న కారణంగా, ముందుగా డీవీవీ దానయ్య కొడుకుతోనే సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  
Go Back to Shorts
teja

More Telugu News