అప్పుడు అన్నయ్య రాజబాబు నన్ను విపరీతంగా కొట్టేశాడు: సోదరుడు అనంత్

  • అప్పటికే అన్నయ్య స్టార్ కమెడియన్ 
  • హోటల్ కి రమ్మంటే సంతోషంగా వెళ్లాను 
  • కొట్టిన తరువాత కారణం చెప్పాడు
హాస్యనటుడిగా అనేక చిత్రాల్లో నటించిన అనంత్, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన ఒక విషయం చెప్పారు. "మా అన్నయ్య రాజబాబు నాకు నాన్నలాంటి వాడే. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ బాగా ఎక్కువగా ఉండేది. నా స్కూల్ చదువులనాటికే అన్నయ్య స్టార్ కమెడియన్. ఒకసారి మా అన్నయ్య షూటింగ్ నిమిత్తం అన్నపూర్ణ హోటల్లో వున్నాడు.

ఆ రోజున క్యారియర్ ఇచ్చి నన్ను పంపించమని చెబితే, అన్నయ్యతో సరదాగా గడపొచ్చని సంతోష పడిపోయాను. హోటల్ కి వెళ్లగానే 'క్యారియర్ అక్కడ పెట్టు' అని చెప్పేసి, ఇక నన్ను పట్టుకుని విపరీతంగా కొట్టేశాడు. 'ఆర్థికపరమైన సమస్యల వలన నేను సరిగ్గా చదువుకోలేదు .. ఇప్పుడు అలాంటి సమస్యలేం లేవు కదా .. మంచిగా చదువుకోవచ్చుగదా' అన్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ సరిగ్గా చదువుకోకపోవడం వలన అన్నయ్యకి బాగా కోపం వచ్చేసి అంతలా కొట్టాడు' అని చెప్పుకొచ్చారు.     
Go Back to Shorts
rajababu
ananth

More Telugu News