యూట్యూబ్ లో సంచలనంగా మారిన చిన్మయి ఇంటర్వ్యూ!

  • తమిళ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన చిన్మయి
  • ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన 'దినతంత్రి'
  • ఒక రోజులో 1.5 మిలియన్ వ్యూస్
'మీటూ' ఉద్యమం ఊపందుకున్న తరువాత, తమిళ రచయిత వైరముత్తు పలువురిపై చేసిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చి పాప్యులర్ అయిన గాయని చిన్మయి, ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనాలను క్రియేట్ చేస్తోంది. తమిళ దినపత్రిక 'దినతంత్రి'కి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూను యూట్యూబ్ లో విడుదల చేయగా, 24 గంటల వ్యవధిలోనే 15 లక్షల మందికి పైగా తిలకించారు. ఆమె ఇంటర్వ్యూ 24 గంటల పాటు టాప్ ట్రెండింగ్ లో 3వ స్థానంలో నిలిచింది. గతంలో కమల్ హాసన్ ఇంటర్వ్యూను ఒక రోజులో 10 లక్షల మంది చూశారు. ఆ రికార్డును చిన్మయి అధిగమించింది. ఇక ఇదే 'దినతంత్రి' ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు శివకార్తికేయన్ తదితరులతో నిర్వహించిన ఇంటర్వ్యూలకు కూడా ఈ స్థాయిలో వ్యూస్ రాలేదట.
Go Back to Shorts
Tamil
Vairamuttu
Chinmaye
You Tube

More Telugu News