‘మహాకూటమి’ అధికారంలోకొస్తే తెలంగాణ ప్రజలను చంద్రబాబు బతకనిస్తాడా?: మంత్రి కేటీఆర్

  • సాగు, తాగునీరు రాకుండా చేయాలని చూస్తున్నారు
  • చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు
  • తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం
‘మహాకూటమి’ అధికారంలోకొస్తే తెలంగాణ ప్రజలను చంద్రబాబు బతకనిస్తాడా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్లలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కృతజ్ఞత సభ నిర్వహించారు. తెలంగాణకు సాగు, తాగునీరు రాకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

 తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలు రైతన్నలు, నేతన్నలు, గీతన్నల తలరాత మార్చే ఎన్నికలు అని అన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్న సంగతి విపక్షాలకు కూడా తెలుసని అన్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తేనే పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. తాము మద్దతు తెలిపిన వ్యక్తే రేపు కాబోయే ప్రధాని అవుతారని, రాబోయే రెండుమూడున్నరేళ్లలో సిరిసిల్లకు రైలు సౌకర్యం రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Go Back to Shorts
KTR
siricilla
Chandrababu

More Telugu News