అజిత్ 'విశ్వాసం' విడుదలపై కోలీవుడ్ టాక్

  • రజనీకాంత్ హీరోగా 'పేట్ట'
  • అజిత్ నాయకుడిగా 'విశ్వాసం'
  • అజిత్ మూవీ రిలీజ్ పై సందిగ్ధం  
అజిత్ .. దర్శకుడు శివ అనగానే కోలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ అంటారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో  'విశ్వాసం' సినిమా రూపొందుతోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టుగా చెప్పారు.

ఇక కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' సినిమా చేస్తున్నాడు. రజనీ సరసన కథానాయికగా సిమ్రాన్ నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పోటీ నుంచి అజిత్ సినిమా తప్పుకునే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. సినిమాపై వసూళ్ల ప్రభావం పడటమే కాకుండా .. థియేటర్ల సమస్య ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశంతో, రిలీజ్ డేట్ వాయిదా వేసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.   
Go Back to Shorts
rajani
ajith

More Telugu News