'మహర్షి' కోసం వేసిన విలేజ్ సెట్ ఖర్చు 8 కోట్లు!

  • 'మహర్షి'లో రైతుగా మహేశ్ బాబు
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • సెట్లోనే ఒకటి రెండు పాటల చిత్రీకరణ      
ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరిస్తున్నారు. చాలా వరకూ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ బాబు రైతు పాత్రలో కనిపించనున్నాడు. నిజంగానే గ్రామాల్లో షూట్ చేద్దామని భావించి ఏపీలోని కొన్ని గ్రామాలకు దర్శక నిర్మాతలు వెళ్లి వచ్చారట.

మహేశ్ బాబుకి గల క్రేజ్ కారణంగా అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారనీ, షూటింగుకి అంతరాయం కలుగుతుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారట. విలేజ్ సెట్ వేయడమే కరెక్ట్ అనుకుని, అచ్చు ఒక ఊరులా అనిపించేలా సెట్ వేయించారు. ఈ సెట్ కోసం 8 కోట్ల వరకూ ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది. మహేశ్ బాబు రైతుగా కనిపించే పల్లెటూరు సన్నివేశాలు, ఆ నేపథ్యంలో వచ్చే ఒకటి రెండు పాటలను ఈ సెట్ లోనే చిత్రీకరిస్తారని చెబుతున్నారు.    
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News