మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

  • ఆలేరు నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మోత్కుపల్లి
  • అకస్మాత్తుగా పడిపోయిన రక్తపోటు
  • భువనగిరి ఆసుపత్రిలో చికిత్స
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ప్రస్తుత ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు ఈ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మోత్కుపల్లి అనుచరులు, అభిమానులు, బీఎల్ఎఫ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయమై ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం వెలువడాల్సివుంది.
Go Back to Shorts
Aleru
Bhuvanagiri
Motkupalli

More Telugu News