రాజమండ్రి నుంచి జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ విమాన సర్వీసులు రద్దు!

  • 5 సర్వీసులు రద్దు 
  • మూడు సర్వీసులు నిలిపివేసిన స్పైస్ జెట్
  • 2 సర్వీసులను ఆపేసిన జెట్ ఎయిర్ వేస్
రాజమండ్రి విమానాశ్రయం నుంచి 5 విమాన సర్వీసులు రద్దయ్యాయి. జెట్ ఎయిర్ వేస్ సంస్థ 2 సర్వీసులను, స్పైస్ జెట్ సంస్థ మూడు సర్వీసులను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించాయి. దీంతో రాజమండ్రి నుంచి బయలుదేరే ఇండిగో, ట్రూ జెట్ విమానాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారా? లేక శాశ్వతంగా రద్దు చేశారా? అన్న విషయం తెలియాల్సి వుంది. కాగా, గత కొంతకాలంగా రాజమండ్రి నుంచి బయలుదేరే సర్వీసుల వల్ల నష్టాన్ని భరించాల్సి వస్తోందని జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ సంస్థలు ఇటీవల పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వీసులను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Rajamahendravaram
Rajamandri
Jet Airways
Spice Jet

More Telugu News