ప్రియుడితో పారిపోయేందుకు యత్నించిన వివాహిత.. భర్త తరుపు బంధువుల సామూహిక అత్యాచారం!

  • యువకుడితో ప్రేమలో పడిన వివాహిత
  • ఇద్దరిపై భర్త తరుపు బంధువుల దాడి
  • ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారం
  • వీడియో సోషల్ మీడియాలో వైరల్
ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిందంటూ ఓ వివాహితమై భర్త తరుపు బంధువులు సామూహిక అత్యాచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన గుజరాత్‌లో  వెలుగు చూసింది. అహ్మదాబాద్ సమీపంలోని నానీ కరాజ్ గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామంలో ఉంటున్న యువకుడిపై ప్రేమలో పడింది. దీంతో భర్త, పిల్లలను వదిలి ఇద్దరూ ఊరు వదిలి పారిపోయేందుకు యత్నించారు.

విషయం తెలుసుకున్న భర్త తరుపు బంధువులు ఆ ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, ఆమె జుట్టును కత్తిరించారు. అయినా కోపం చల్లారక.. ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ పోలీసులకు చేరడంతో.. అత్యాచారానికి పాల్పడిన మానిబెన్ బాబోర్, రాకేశ్ బాబోర్, రాజేశ్ బాబోర్‌, భరత్ మావి, నర్సింగ్ మావి, దినేశ్ పర్మార్, శైలేష్ బరియాలను అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Gujarath
Maniben babor
Rakesh
Rajesh
Bharath Mavi
Narsing Mavi
Dinesh Parmar

More Telugu News