చెక్ పవర్ అత్తయ్య చేతిలో ఉండటం వల్లే జయరాంకు ఆర్థిక సమస్యలు: శిఖా చౌదరి

  • జయరాం చాలా మంది దగ్గర అప్పులు చేశారు
  • జయరాంకు రాకేశ్ రూ.4.5 కోట్లు అప్పుగా ఇచ్చాడు
  • ఆ డబ్బును సకాలంలో జయరాం తిరిగి ఇవ్వలేదు
ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరి, పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించింది. చెక్ పవర్ తన అత్తయ్య చేతిలో ఉండటం వల్లే జయరాం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడని, అందువల్లే చాలా మంది దగ్గర ఆయన అప్పులు చేశారని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జయరాంకు రాకేశ్ రూ.4.5 కోట్లు అప్పు కింద ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ డబ్బును సకాలంలో జయరాం తిరిగి ఇవ్వలేదని, ఈ విషయమై రాకేశ్ కు, తనకు తరచు గొడవలు జరిగేవని, దీంతో, జయరాంపై రాకేశ్ కోపం పెంచుకున్నాడని చెప్పినట్టు సమాచారం. 
Go Back to Shorts
coastal bank
jayaram
sikha chowdary

More Telugu News