శ్రీదేవి ప్రథమ వర్ధంతిని జరిపేది అక్కడే!

  • స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి
  • క్రితం ఏడాది ఫిబ్రవరి 24న మరణం
  •  చెన్నై లోని ఇంట్లో ప్రథమ వర్ధంతి      
తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో శ్రీదేవి నెంబర్ వన్ కథానాయికగా ఒక వెలుగు వెలిగారు. దేశ వ్యాప్తంగా లక్షలమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి శ్రీదేవి క్రితం ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని ఒక హోటల్లో హఠాత్తుగా చనిపోయారు. ఆమె మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేనివాళ్లు ఎంతోమంది వున్నారు.

అప్పుడే శ్రీదేవి చనిపోయి ఏడాది కావొస్తుందా అని బయటివారికి అనిపించవచ్చు. కానీ శ్రీదేవి కుటుంబ సభ్యులు మాత్రం ప్రతి రోజు ఒక ఏడాదిలానే గడిపారు. శ్రీదేవి ప్రథమ వర్ధంతిని జరపడానికి వాళ్లంతా సిద్ధమవుతున్నారు. శ్రీదేవికి చెన్నై నగరం పట్ల .. అక్కడి తన ఇల్లు పట్ల ప్రేమ ఎక్కువట. అందువలన అక్కడే ఆమె ప్రథమ వర్ధంతిని జరపాలని వాళ్లు నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్టు చెబుతున్నారు.
Go Back to Shorts
Sridevi

More Telugu News