సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చీరలో అందంగా కనిపిస్తానంటున్న నాయిక 
  • బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ అక్కినేని 
  • వంద కోట్ల క్లబ్బులో కంగన సినిమా 
 *  త్వరలో విడుదల కానున్న 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' చిత్రంలో తన పాత్ర 'మై హూనా' హిందీ సినిమాలో సుస్మితా సేన్ పాత్రను గుర్తుకు తెస్తుందని అంటోంది కథానాయిక రాయ్ లక్ష్మి. ఈ సినిమాలో చీరలో అందంగా కనిపిస్తానని చెప్పింది.
*  అఖిల్ అక్కినేని ఇంతవరకు చేసిన సినిమాలలో ఒక్కటి కూడా విజయాన్ని సాధించలేదు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం కోసం బొమ్మరిల్లు భాస్కర్ ని దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వీరి కలయికలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుందట.
*  కంగనా రనౌత్ నాయికగా నటించిన 'మణికర్ణిక' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొంది బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఇండియా వసూళ్ల పరంగా చూస్తే 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఇక ప్రపంచ వ్యాప్త వసూళ్లను తీసుకుంటే 150 కోట్ల నెట్ దాటినట్టు సమాచారం.
Go Back to Shorts
Rai Lakshmi
Susmithasen
Akhil
Kangana

More Telugu News