కూతురు కోసం రంగంలోకి దిగుతోన్న జీవిత?

  • శివాత్మిక నాయికగా '2 స్టేట్స్'
  • కొన్ని కారణాల వలన ఆగిపోయిన షూటింగ్
  • త్వరలో పట్టాలెక్కించే దిశగా జీవిత  
జీవిత .. రాజశేఖర్ తమ పెద్ద కూతురైన శివాత్మికను కథానాయికగా తెలుగు తెరకు పరిచయం చేయాలని కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నారు. వెంకట్ దర్శకత్వంలో '2 స్టేట్స్' సినిమా ద్వారా శివాత్మికను పరిచయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అడివి శేష్ .. శివాత్మిక జంటగా ఈ సినిమా షూటింగు మొదలై కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు వెంకట్ కు .. అడవి శేష్ కి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. శివాత్మిక తొలి సినిమా ఇలా ఆగిపోవడం బాధించడంతో, ఎలాగైనా ఈ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి జీవిత - రాజశేఖర్ వచ్చారట. జీవితకి దర్శకత్వంలో మంచి అనుభవం వుంది. పైగా '2 స్టేట్స్' రీమేక్ కావడం వలన పెద్దగా సమస్య ఉండదు. అందువలన ఎన్నికల హడావిడి పూర్తయిన తరువాత ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను జీవిత తన చేతిలోకి తీసుకోనుందని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
jeevita
shivathmika

More Telugu News