భేష్... ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు: ఈసీపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు

  • ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ఈసీనే కారణం
  • ఈసీని నిందించడం సరికాదు
  • దేశంలోని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయి
దేశంలోని విపక్ష పార్టీల నేతలంతా ఈసీ తీరుపై మండిపడుతున్న వేళ... భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈసీ తీరును మెచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని కితాబిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ కారణం. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను చాలా గొప్పగా నిర్వహించారు. ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదు' అని ప్రణబ్ దాదా చెప్పారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో ఏళ్లుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయి... అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు.
Go Back to Shorts
Pranab Mukherjee
ec

More Telugu News