భద్రత, గోప్యత లక్ష్యంగా గూగుల్‌లో సరికొత్త ఫీచర్లు

  • ఆన్‌లైన్‌లో మార్పిడి వివరాలకు రక్షణ
  • సెట్టింగ్స్‌ కంట్రోల్స్‌ సమీక్షిస్తామన్న యాజమాన్యం
  • గూగుల్‌ ఉత్పత్తులు, సేవలకు ఒకే టాప్‌
వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత, గోప్యత ఉండేలా సరికొత్త ఫీచర్లను తీసుకువస్తున్నట్లు గూగుల్‌ సెర్చింజిన్‌ తెలిపింది. గూగుల్‌ చీఫ్‌ ప్రైవసీ అధికారి కీత్‌ ఎన్‌రైట్‌ విలేకరులతో మాట్లాడుతూ గూగుల్‌ ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకుంటున్న వారందరికీ ఒకేరకమైన భద్రత కల్పించడం తమ లక్ష్యమని వివరించారు. వినియోగదారుల సమాచారాన్ని థర్డ్‌ పార్టీ డెవలపర్స్‌ ఇతరులతో పంచుకుంటున్నారని గుర్తించామని, దీన్ని నియంత్రించేందుకు గోప్యత విధానం పాటించాలని సూచించినట్లు తెలిపారు. క్రోమ్‌ ఎక్సటెన్షన్‌ డెవలపర్స్‌ కూడా వినియోగదారుల భద్రతను కాపాడేలా అదనపు మార్పులు చేసినట్లు వివరించారు. గూగుల్‌  సెట్టింగ్స్, కంట్రోల్స్‌ను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తామన్నారు. గూగుల్‌ ఉత్పత్తుల, సేవలన్నింటికీ ఒకే టాప్‌ ఉపయోగించనున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
google
praivacy settings
secrurity

More Telugu News