ప్రజాప్రతినిధులు పర్సంటేజ్ లు అడిగితే నా దృష్టికి తీసుకురండి: ఎమ్మెల్యే ఆర్కే

  • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించను
  • ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులుంటే అండగా ఉంటా
  • భగవంతుడు, ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచా
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ప్రజాప్రతినిధులు పర్సంటేజ్ లు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సూచించారు. మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి అండగా ఉంటానని చెప్పారు. మండల పరిషత్ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్సనిసరిగా హాజరు కావాలని చెప్పారు. భగవంతుడు, ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ తాను ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. 
Go Back to Shorts
Mangalagiri
MLA

More Telugu News