రోడ్డు కుంగింది... వాహనాలను మింగేసింది!

  • అమెరికాలోని ఓర్లాండోలో ఘటన
  • రోడ్డుపై భారీ గుంతలు
  • పొంగిన నీరు
అమెరికాలోని ఓర్లాండో ఆరెంజ్ కౌంటీలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచగా, రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డుపై అనేకచోట్ల భారీస్థాయిలో మట్టి కుంగిపోవడంతో వాహనాలు గుంతల్లో పడిపోయాయి. రోడ్డు కుంగిపోయిన చోట భారీగా నీరు పొంగిపొర్లుతోంది.

ఒకప్పుడు ఆ ప్రాంతంలో సరస్సు ఉండేదని, కాలక్రమంలో అక్కడ పూడిక పేరుకుపోయి మైదానంగా మారిపోయిందని, ఇప్పుడా సరస్సుపైన ఉన్న రోడ్డే కుంగిపోయిందని స్థానికులు అంటున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన వెంటనే ఆరెంజ్ కౌంటీ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కుంగిపోయిన వాహనాలు బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Go Back to Shorts
USA
Orlando
Orange County

More Telugu News