మేఘాంశ్ హీరో కావడంతో శ్రీహరి కోరిక నెరవేరింది: డిస్కోశాంతి

  • శ్రీహరి అలా కోరుకున్నాడు
  • పిల్లలను డాక్టర్ గా .. లాయర్ గా చూడాలనుకున్నాను
  • శ్రీహరి అనుకున్నట్టుగానే జరిగిందన్న డిస్కోశాంతి
శ్రీహరి తనయుడు మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా డిస్కోశాంతి మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా శ్రీహరి తన పిల్లలిద్దరూ చిత్రపరిశ్రమలోనే వుండాలని భావించేవాడు. ఒకరు దర్శకుడైతే మరొకరు హీరో కావాలని ఆయన కోరుకునేవాడు.

నాకు మాత్రం వాళ్లు చిత్రపరిశ్రమకి రావడం ఇష్టం లేదు. ఒకరు డాక్టర్ కావాలనీ .. మరొకరు లాయర్ కావాలని ఉండేది. కానీ పెద్దాడు దర్శకత్వం దిశగా అడుగులు వేస్తున్నాడు. 'రాజ్ దూత్'తో మేఘాంశ్ హీరోగా మారిపోయాడు. కనుక శ్రీహరి కోరిక నెరవేరిపోయింది" అని ఆమె చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
srihari
Disco Shanthi

More Telugu News