'సాహో' నుంచి తొలిసారి రొమాంటిక్ పోస్టర్!

  • ఆగస్టులో విడుదలకు సిద్ధమైన 'సాహో'
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా చిత్ర యూనిట్
  • గ్రాఫిక్స్ ఆలస్యం కావడంతోనే విడుదల ఆలస్యం
వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైన 'సాహో' ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా, ఇప్పుడో రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇండియాలోని పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే రోజు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఇంకా ముందే విడుదల చేయాలని భావించినప్పటికీ, గ్రాఫిక్స్ ఆలస్యమైన కారణంగా రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Prabhas
Shraddha Kapoor
Sahoo
Poster

More Telugu News