విచిత్రం! మెడ నుంచి గుడ్డు పెడుతున్న కోడి.. విస్తుపోతున్న జనం!

  • కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘటన
  • వీడియో తీసి పోస్టు చేసిన యజమాని
  • చూసేందుకు క్యూకడుతున్న గ్రామస్థులు
కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన ఓ కోడిపెట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతగా అది ఏం చేసిందనేగా మీ ప్రశ్న.. అన్ని కోళ్లలా కాకుండా ఇది మెడ నుంచి గుడ్డు పెడుతోంది. ఇది గమనించిన దాని యజమాని శివరామె గౌడ అది మెడనుంచి గుడ్డు పెడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే.. క్షణాల్లోనే వైరల్ అయింది. ప్రపంచంలో ఎక్కడా, ఏ కోడీ మెడ నుంచి గుడ్డు పెట్టగా తాము చూడలేని ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతుంటే.. గ్రామస్థులు మాత్రం కోడిని చూసేందుకు క్యూకడుతున్నారు.

Go Back to Shorts
Hen
Karnataka
Mandya
laying egg

More Telugu News