రాజ్యసభలో బీజేపీ ఎంపీకి విద్యుత్ షాక్

  • మైక్ నుంచి పొగలు
  • తీగలు సరిచేద్దామని పట్టుకున్న ఎంపీ ఆల్ఫోన్స్ కు విద్యుదాఘాతం
  • సభను వాయిదా వేసిన వెంకయ్యనాయుడు
రాజ్యసభలో ఇవాళ ఓ ఎంపీ విద్యుదాఘాతానికి గురికావడంతో ఇతర సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ సీటు వద్ద ఉండే మైక్ నుంచి పొగలు రావడంతో, వైర్లు పట్టుకుని సరిచేయబోయిన బీజేపీ ఎంపీ కేజే ఆల్ఫోన్స్ కు కరెంట్ షాక్ తగిలింది. దాంతో ఇతర సభ్యులు ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఆల్ఫోన్స్ తన సీట్లోంచి వెళ్లి మరో సీట్లో కూర్చున్నారు. ఈ విషయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి తెలియడంతో ఆయన సభను పావుగంట సేపు వాయిదా వేశారు. పొగలు వస్తున్న మైక్ ను సరిచేయాలంటూ రాజ్యసభ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన అనంతరం సాధారణ కార్యకలాపాల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Go Back to Shorts
Rajya Sabha
BJP

More Telugu News