సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • షూటింగ్ కి రెడీ అవుతున్న సమంత
  • చైతు, రష్మికల లవ్ ఎంటర్ టైనర్  
  • పోలీస్ ఆఫీసర్ గా సంగీత దర్శకుడు
*  సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న '96' తెలుగు రీమేక్ తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 16 నుంచి జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో  షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.
 *  అక్కినేని నాగ చైతన్య, రష్మిక తొలిసారి జోడీ కడుతున్నారు. వీరిద్దరి కలయికలో 'అదే నువ్వు అదే నేను' పేరిట ఓ లవ్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. నూతన దర్శకుడు శశికుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్టు సమాచారం.
*  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. శివనాగు దర్శకత్వంలో తారకరత్న హీరోగా రూపొందుతున్న 'దేవినేని' చిత్రంలో అప్పటి విజయవాడ ఎస్పీ కె.ఎస్.వ్యాస్ పాత్రలో కోటి నటిస్తున్నారు.
Go Back to Shorts
Samantha
Sharvanand
Rashmika
Koti

More Telugu News