పొద్దుపొద్దున్నే టపాసుల పేలుళ్లతో మోతెక్కిపోయిన తమిళనాడు!

  • అంబరాన్ని అంటిన సంబరాలు
  • ఉదయం 6 గంటల నుంచే సందడి
  • సాయంత్రం మరో గంట పాటు టపాసుల పేలుళ్లు
తమిళనాడులో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఉదయం పేలుళ్లతో వీధులన్నీ మోతెక్కిపోయాయి. చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొద్దున్నే ప్రజలు టపాసుల మోత మోగించారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి పండగను ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణసంచా కాల్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతించగా, ఈ ఉత్తర్వులు సడలించాలని, ఉదయం పూట కాల్చడం తమ సంప్రదాయమని తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును సడలిస్తూ, రోజులో ఎప్పుడైనా రెండు గంటల పాటు టపాసులు కాల్చుకునేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Tamilnadu
Crakers
Dewali

More Telugu News