పాతాళంలోకి జారిపోయిన మిమ్మల్ని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు: విజయసాయి రెడ్డి

  • ఇసుక తుపానులో గిర్రున తిరిగి పడ్డాడు
  • ఇంగ్లిష్ మీడియంపై గుండెలు బాదుకున్నాడు 
  • ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియం ఆలోచనే తనదని యూటర్న్ తీసుకున్నాడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ముందు ఇసుక సమస్యపై, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై విమర్శలు చేసి వెనక్కి తగ్గారని ట్వీట్ చేశారు.

'ఇసుక తుపానులో గిర్రున తిరిగి పడ్డాక ఇంగ్లిష్ మీడియంపై గుండెలు బాదుకున్నాడు. ప్రజలు ఛీత్కరించే సరికి అసలు ఇంగ్లిష్‌ మీడియం ఆలోచనే తనదని యూటర్న్ తీసుకున్నాడు. బతుకంతా అవకాశవాదం, మ్యానిప్యులేషన్లే. పాతాళంలోకి జారిపోయిన మిమ్మల్ని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News