సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య

  • ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
  • రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
  • ఓటమికి బాధ్యత వహిస్తున్నానన్న సిద్ధరామయ్య
కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా... ఏకంగా 12 స్థానాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్సీ) పదవికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని... రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించానని తెలిపారు.
Go Back to Shorts
Sidharamaiah
Karnataka
CLP
Resign

More Telugu News