నిప్పుల్లో నడిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్... వీడియో ఇదిగో!

  • ప్రత్యేక అయ్యప్ప పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
  • ఆపై నిప్పుల్లో నడిచిన శంకర్ నాయక్
  • వైరల్ అవుతున్న వీడియో
మహబూబాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత శంకర్ నాయక్, అయ్యప్ప మాల వేసుకుని నిప్పుల్లో నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన నియోజకవర్గంలో జరిగిన ప్రత్యేక అయ్యప్ప పూజల్లో పాల్గొన్న ఆయన, ఆపై ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచారు. ఇటీవలే వెలమ, రెడ్డి కులస్తులను టార్గెట్ చేసుకుని శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక నిప్పులపై నడిచిన తరువాత శంకర్ నాయక్ మాట్లాడుతూ, గత వారం తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను నిజం మాట్లాడినందునే నిప్పు తనను ఏమీ చేయలేదని అన్నారు. శంకర్ నాయక్ నిప్పులపై నడవడంపై టీవీ చానెళ్లలో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు సైతం సాగాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Mahabubabad
Shankar Naik

More Telugu News