సౌందర్య చనిపోయిన తరువాతనే నాకు అర్థమైంది: యాక్షన్ కింగ్ అర్జున్

  • సౌందర్య చాలా గొప్ప నటి
  • అందమైన అభినయం పేరే సౌందర్య
  • అలాంటి ఫ్రెండ్ దొరకడం గొప్ప విషయమన్న అర్జున్
తెలుగు .. తమిళ.. మలయాళ .. కన్నడ సినిమాల్లో యాక్షన్ హీరోగా అర్జున్ మంచి మార్కులు కొట్టేశారు. ఈ నాలుగు భాషల్లోను కలుపుకుని ఆయన అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నటన వైపుకి వచ్చిన తరువాత ఎన్నో కష్టాలుపడ్డాను .. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఆ పాఠాలను గుర్తుపెట్టుకుని ధైర్యంగా అడుగులు ముందుకు వేశాను.

ఈ ప్రయాణంలో ఎంతోమంది స్నేహితులయ్యారు .. వాళ్లలో జగపతిబాబు ఒకరు .. సౌందర్య ఒకరు.  'మిస్ యూ' అనే పదానికి అర్థం ఏమిటనేది సౌందర్య చనిపోయిన తరువాత తెలిసింది. సౌందర్య ఎంత అందమైనదో .. అంతకి మించిన అభినయం ఆమె సొంతం. అందం .. అభినయం .. పద్ధతి .. ఇలా అన్ని రకాల మంచి లక్షణాలన్నీ కలిపితే సౌందర్య అవుతుంది. అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండటం నిజంగా చాలా అరుదైన విషయం" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Arjun
Jagapathi Babu
Soundarya

More Telugu News