ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి కారణం ఇదే: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • అమరావతి విడిపోయిందనే బాధతోనే రాజీనామా చేశా
  • చంద్రబాబు చూపిన ఆదరణను మరువలేను
  • ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను
ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కు కాకుండా పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తనపై చంద్రబాబు, నారా లోకేశ్ చూపిన ఆదరణను ఎన్నటికీ మరువలేనని... ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. 2019 ఎన్నికల్లో తనకు ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Dokka Manikya Varaprasad
Telugudesam
Chandrababu

More Telugu News