ఏపీ అసెంబ్లీలో 'శాసన మండలి రద్దు' తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్

  • మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ
  • కొన్ని రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాలు బాగోలేవన్న ఆళ్ల కాళీకృష్ణ
  • సొంత ప్రయోజనాలపైనే దృష్టిపెట్టారని టీడీపీ నేతలపై విమర్శలు
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు. మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాలు బాగోలేవని ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా సొంత ప్రయోజనాలపైనే దృష్టిపెట్టి అసెంబ్లీ, శాసనమండలిలో టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాల వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆయన ఆరోపించారు.
Go Back to Shorts
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News