పూల వ్యాపారి భార్య ఖాతాలో రూ. 30 కోట్లు వచ్చి పడ్డాయ్!

  • కర్ణాటకకు చెందిన వ్యాపారి సయ్యద్ మాలిక్
  • ఆన్ లైన్లో చీర కొనడంతో లాటరీ తగిలిందని ఫోన్
  • ఆదాయపన్ను శాఖకు ఫిర్యాదు
అతను ఓ సాధారణ పూల వ్యాపారి. రెక్కాడితేగాని డొక్కాడని వ్యక్తి. అతని భార్య బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా రూ. 30 కోట్లు వచ్చిపడటంతో, అంత డబ్బు ఎవరు, ఎందుకు వేశారో తెలియక, దాన్ని వాడుకుంటే ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

రామనగర జిల్లా చెన్నపట్టణకు చెందిన సయ్యద్ మాలిక్ బుర్హాన్ అనే పూల వ్యాపారి భార్య ఖాతాలో ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు వచ్చి పడింది. ఆ విషయాన్ని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి చెప్పేంతవరకూ అతనికిగానీ, అతని భార్యకు గానీ విషయం తెలియదు. ఇన్ని డబ్బులు మీ ఖాతాలో ఎవరు జమ చేశారని వారు ప్రశ్నించడంతో బుర్హాన్ అవాక్కయ్యాడు.

తాను గతంలో ఓ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా చీరను ఆర్డర్ చేశానని, అప్పుడు తాను ఓ కారును గెలుచుకున్నానని చెబుతూ, తన బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్ చేసి, అడగడంతో భార్య అకౌంట్ నంబర్ వివరాలు చెప్పానని, ఈ డబ్బు ఎవరు వేశారో తెలియదని అతను అంటున్నాడు.

ఇదిలావుంచితే, ఈ విషయంపై బుర్హాన్ ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో పోలీసులు మోసం, మరొకరి పేరు మీద లావాదేవీల కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అకౌంట్ ద్వారా చాలా లావాదేవీలు జరిగాయనీ, అవన్నీ బుర్హాన్ కు తెలియకపోవచ్చనీ పోలీసధికారి చెప్పారు. ఏమైనా, దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే తేలుస్తామని అన్నారు.
Go Back to Shorts
Bengaluru
Plower Murchent
Lottery
Bank Account

More Telugu News