ఉప్పెన నుంచి 'నీ కన్ను నీలి సముద్రం' పాట రిలీజ్

Nee Kannu Neeli Samudram song released from Uppena
  • సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ అరంగేట్రం
  • బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఉప్పెన'
  • సంగీతం సమకూర్చిన దేవిశ్రీప్రసాద్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ కన్ను నీలి సముద్రం' అనే మధురమైన గీతాన్ని చిత్రబృందం రిలీజ్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, జావేద్ అలీ గానం చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Go Back to Shorts
Uppena
Nee Kannu Neeli Samudram
Panja Vaishnav Tej
Saidharam Tej
Tollywood

More Telugu News