ఇప్పటికైనా మమ్మల్ని వదిలెయ్యండి: మీడియాపై అసహనం వ్యక్తం చేసిన మారుతీరావు భార్య

Maruti Rao wife Girija gets anger over media
  • ప్రణయ్ కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు బలవన్మరణం
  • మృతదేహం మిర్యాలగూడ తరలింపు
  • మారుతీరావు నివాసానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు
  • ఇక చాలండీ అంటూ మీడియాకు రెండు చేతులు జోడించిన మారుతీరావు భార్య
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనూహ్యరీతిలో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలం మిర్యాలగూడ తరలించారు. కాగా, మారుతీరావు నివాసానికి వచ్చిన మీడియా ప్రతినిధులను చూసి ఆయన భార్య గిరిజ తీవ్రస్థాయిలో స్పందించారు.

ఇకనైనా మమ్మల్ని వదిలెయ్యండి, మీడియా వాళ్లూ ఇకచాలండీ అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టారు. దాంతో అక్కడ ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ప్రణయ్ హత్యోదంతం తర్వాత మారుతీరావుపై అనేక మీడియా సంస్థలు పెద్ద ఎత్తున కథనాలు వెలువరించాయి. మారుతీరావు అంటే అత్యధికుల్లో వ్యతిరేక భావనలు ఏర్పడ్డాయి.
Go Back to Shorts
Marutirao
Media
Miryalaguda
Girija

More Telugu News