చాలా సార్లు ప్రేమలో పడ్డా.. మోసపోయా: లక్ష్మీరాయ్

Lakshmi Rai response on Love affairs
  • లక్ష్మీరాయ్ అఫైర్లపై మీడియాలో పలు వార్తలు
  • చాలా బ్రేకప్ లు జరిగాయన్న లక్ష్మి
  • మూడు సార్లు ప్రేమలో మోసపోయానని స్పష్టీకరణ
దక్షిణాది భామ లక్ష్మీరాయ్ పలు భాషా చిత్రాల్లో గుర్తింపు పొందింది. హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన లక్ష్మీరాయ్... ఐటెం సాంగ్స్ తో కూడా పలు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఆమె దృష్టి సారించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తనకు అఫైర్లు ఎక్కువంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ... గతంలో తాను పలుసార్లు ప్రేమలో పడ్డానని తెలిపింది. ఎన్నో బ్రేకప్ లు జరిగాయని చెప్పింది. మూడు సార్లు ప్రేమలో మోసపోయానని వెల్లడించింది.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో కూడా లక్ష్మీకి అఫైర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఓ బాలీవుడ్ నిర్మాత కుమారుడితో ప్రేమలో పడ్డట్టు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Lakshmi Rai
Tollywood
Bollywood
Affairs

More Telugu News